హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, మూసాపేట్ ఈసీఐఎల్, నాగారం, జవహార్ నగర్, కీసరలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం