'కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారింది'

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటివెలుగు పథకం కింద కంటి ఆపరేషన్లు ఎవరికి చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తే ఆరోగ్య శ్రీని నిలిపివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు ఆరోగ్య శ్రీని కూడా కంటిన్యూ చేయాలన్నారు. కాగా బడ్జెట్‌లో విద్య కోసం రూ.14728 కోట్లు కేటాయించారని, అయితే విద్యపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. (‘అప్పుడు కరెంట్‌ బందు.. ఇప్పుడు రైతు బంధు’)